Logo
Download our app
108 లో డెలివరీ తల్లి..బిడ్డ క్షేమం
NEWS   Feb 11,2025 07:43 am
వెల్గటూర్ మండలం మొక్కట్రావ్ పేట గ్రామానికి చెందిన మద్దెల ప్రత్యూష పురిటి నొప్పులు రావడంతో రాత్రి 11.30సమయంలో 108 కి కాల్ చేసింది. తక్షణమే స్పందించిన 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ అనిల్, పైలట్ కిషన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేయగా ఆడపిల్ల జన్మించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source