సిసీ కెమెరా ల ఏర్పాటు కు రూ. 1 లక్ష విరాళం
NEWS Feb 10,2025 03:36 pm
కామారెడ్డి దేవునిపల్లి పిఎస్ పరిధిలోని గుమాస్తా కాలనీ లో కాలనీవాసులు , వ్యాపారస్తులు ముందుకు వచ్చి చౌరస్తాలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం విరాళాలు సేకరించారు. తమ వంతుగా రూ. 1 లక్షను పోలీస్ వారికి అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ రాజు వీరిని అభినందించారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు కూడా స్వచ్చంధంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.