రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదు
NEWS Feb 10,2025 12:48 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కుటుంబంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ప్రస్తుతం మూడు ముక్కలాట కొనసాగుతోందన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ ఎవరికి వారు గ్రూప్ లు నిర్వహిస్తున్నారని అన్నారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబీకులకు రీ సర్వే జరపాలంటూ అడిగే అర్హత లేదన్నారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.