Logo
Download our app
కేజీబీవీ ఘ‌ట‌న‌పై హోం మంత్రి సీరియ‌స్
NEWS   Feb 10,2025 06:55 am
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముసునూరు కేజీబీవీలో జ‌రిగిన‌ ఘటనపై మంత్రి వంగ‌ల‌పూడి అనిత సీరియ‌స్ అయ్యారు. కావ‌లి డీఎస్పీ శ్రీ‌ధ‌ర్ తో ఫోన్ లో మాట్లాడారు. అర్ధ‌రాత్రి ఓ దుండ‌గుడు గోడ దూకి విద్యార్థినుల గ‌దుల్లోకి ప్ర‌వేశించ‌డంపై ఆరా తీశారు. వెంట‌నే నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ప్ర‌త్యేక పికెట్ నిర్వ‌హించి భ‌ద్ర‌త పెంచామ‌న్నారు డీఎస్పీ. బాలిక‌ల పేరెంట్స్ ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని మంత్రి కోరారు. నిఘా మ‌రింత పెంచాల‌ని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source