Logo
Download our app
తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ కేసులో న‌లుగురు అరెస్ట్
NEWS   Feb 10,2025 05:40 am
తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ల‌డ్డూ క‌ల్తీకి సంబంధించి విచార‌ణ చేప‌ట్టిన సిట్ న‌లుగురిని అరెస్ట్ చేసింది. ఉత్త‌రాఖండ్ లోని రూర్కీకి చెందిన భోలే బాబా డెయిరీ డైరెక్ట‌ర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ , పూనంబాకం లోని వైష్ణ‌వి డెయిరీ సీఈవో అపూర్వ చావ్డా, దుండిగ‌ల్ లోని ఏఆర్ డెయిరీ ఎండీ రాజ‌శేఖ‌ర‌న్ ను అదుపులోకి తీసుకుంది. తిరుప‌తి కోర్టులో వీరిని హాజ‌రు ప‌రిచింది. ల‌డ్డూ క‌ల్తీలో అక్ర‌మాలు జ‌రిగింది వాస్త‌వ‌మేనంటూ పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source