Logo
Download our app
ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం విచారం
NEWS   Feb 10,2025 04:48 am
ప‌ల్నాడు జిల్లా ముప్పాళ్ల‌లో జ‌రిగిన ట్రాక్ట‌ర్ ప్ర‌మాదంపై సీఎం చంద్ర‌బాబు తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో న‌లుగురు మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source