సీఐడీ విచారణకు రాలేను
NEWS Feb 09,2025 02:39 pm
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నానని, తాను సీఐడీ విచారణకు ఈనెల 10న సోమవారం హాజరు కాలేనంటూ స్పష్టం చేశారు. తనకు ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని కోరారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ల ఫోటోలను మార్ఫింగ్ చేశారన్న కేసుకు సంబంధించి కేసు నమోదైంది. సీఐడీ విచారణకు రావాలంటూ నోటీసు ఇచ్చింది. దీనిపై స్పందించారు ఆర్జీవీ.