మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా
NEWS Feb 09,2025 02:30 pm
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కే బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. సీఎం రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు ఆపద్దర్మ సీఎంగా ఉండాలని బీరేన్ సింగ్ ను కోరారు గవర్నర్. ఒకటి రెండు రోజుల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో సీఎం విఫలమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.