ఆప్ కొంప ముంచిన లిక్కర్ స్కామ్
NEWS Feb 09,2025 04:19 am
ఢిల్లీ లిక్కర్ స్కాం ఆప్ కొంప ముంచేలా చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కామెంట్ చేశారు. అందుకే జనం ఆప్ ను నమ్మలేదని, బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. బీజేపీ జనాన్ని హామీల పేరుతో బురిడీ కొట్టించడంలో సక్సెస్ అయ్యిందన్నారు. అవినీతిపై యుద్దం చేస్తానని ప్రకటించిన కేజ్రీవాల్ చివరకు అవినీతి, అక్రమాలకు ఆప్ ను కేరాఫ్ గా మార్చారంటూ ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాం వల్లనే కేజ్రీవాల్ దారుణంగా ఓటమి పాలయ్యారని అన్నారు.