మంత్రులు 5 రోజుల్లో ఫైల్స్ క్లియర్ చేయాలి
NEWS Feb 09,2025 03:32 am
మంత్రుల పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. 5 రోజుల్లో ఫైల్స్ క్లియర్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సిస్టమ్ లేదన్నారు. మన స్థానాన్ని బట్టే హోదా దక్కుతుందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ ను క్లియర్ చేస్తే సమస్యలంటూ ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, ఆ విషయం గమనించి పనిపై ఫోకస్ పెట్టాలన్నారు.