పనితీరు చూసి పట్టం కట్టారు
NEWS Feb 09,2025 02:59 am
తమ పనితీరు చూసి ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారని అన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఢిల్లీని కాలుష్య, అవినీతి రహిత నగరంగా మారుస్తామన్నారు. ఆప్ అవినీతి, అక్రమాలకు దేశ రాజధానిని అడ్డాగా మార్చేసిందని ఆరోపించారు. ప్రజలు సుస్థిరత, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకున్నారని అన్నారు.