Logo
Download our app
అరవింద్ కేజ్రీవాల్ పై కిషన్ రెడ్డి సెటైర్లు
NEWS   Feb 09,2025 02:37 am
ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ పై మండిప‌డ్డారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఆప్ ని ఓడించాలంటే మోడీ ఇంకో జ‌న్మ ఎత్తాలంటూ సెటైర్ వేశార‌న్నారు. 2025లో కాదు క‌దా 2050లో కూడా త‌మ‌పై గెల‌వ‌లేర‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు కూడా అహంకారంతో అస‌త్య ప్ర‌చారాం చేశారంటూ మండిప‌డ్డారు. లిక్క‌ర్ స్కామ్, వాట‌ర్ స్కామ్, ఆప్ ఎమ్మెల్యేల కుంభ‌కోణాల కార‌ణంగానే వాళ్లు ఓట‌మి పాల‌య్యార‌ని అన్నారు. ఇక‌నైనా త‌మ త‌ప్పులు తెలుసుకుంటే మంచిదంటూ హిత‌వు ప‌లికారు కేంద్ర మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source