రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
NEWS Feb 08,2025 10:04 am
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి శివారులో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి శివారులో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి. చెందాడు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రమేష్ సమాచారం ఇవ్వగా. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని నిజామాబాద్ జి జిహెచ్ కు తరలించారు.