శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.99 కోట్లు
NEWS Feb 08,2025 03:23 am
తిరుమల శ్రీవారిని 62 వేల 971 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.99 కోట్లు వచ్చాయని ఈవో శ్యామల రావు. ప్రస్తుతం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు.