జగన్ కావాలనే డ్యామేజ్ చేశాడు
NEWS Feb 08,2025 02:38 am
మాజీ సీఎం జగన్ పై సోదరి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తనపై కావాలనే విజయ సాయి రెడ్డితో తిట్టించాడని అన్నారు. జగన్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ విజయ సాయి రెడ్డి తనతో చెప్పుకుని వాపోయడన్నారు. షేర్స్ తనకే చెందాలంటూ తనపై, తన తల్లి విజయమ్మపై కేసులు వేశాడని వాపోయారు. సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి మాటలు అబద్దమంటూ లేఖ రాశారన్నారు. అయినా జగన్ ఊరుకోలేదని, ఆ తర్వాత కూడా ఒత్తిడి తీసుకు వచ్చారంటూ ఆరోపించారు.