చంద్రబాబును కలిసిన ఎస్ఎస్ థమన్
NEWS Feb 07,2025 02:14 pm
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలుసుకున్నారు. ఈనెల 15న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం థమన్ ఆధ్వర్యంలో జరగనుంది. విశిష్ట అతిథులుగా సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ , నారా భువనేశ్వరి హాజరు కానున్నారు. ప్రత్యేకంగా థమన్ ను అభినందించారు సీఎం.