అక్కినేనికి ప్రధాని మోడీ నివాళి
NEWS Feb 07,2025 01:59 pm
అక్కినేని నాగేశ్వర్ రావుకు ఘనంగా నివాళులు అర్పించారు పీఎం మోడీ. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు. పార్లమెంట్ హౌస్ లో మహాన్ అభినేత అక్కినేని విరాట్ వ్యక్తిత్వం అనే పుస్తకాన్ని మోడీకి నటుడు నాగార్జున అందజేశారు. 100వ జయంతి పురస్కరించుకుని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ దీనిని రాశారు. అక్కినేని పుస్తకాన్ని తనకు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.