రిషి చరణ్ తేజ్ కు ఏఎస్పీ అభినందన
NEWS Feb 07,2025 01:54 pm
బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆకునూరి రిష్ చరణ్ తేజ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అజీమ్ ప్రేమ్ జీ విశ్వ విద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు. సీటు సంపాదించాడు. తను 10వ తరగతి వరకు స్థానికంగా చదివాడు. ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివాడు. మంచి మార్కులు పొందాడు. సత్తా చాటాడు. ఈ సందర్బంగా ఆకునూరి రిష్ చరణ్ తేజను ఏఎస్పీ రవికుమార్ పూలమాలలు వేసి, ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాక్షించారు.