DWO బాధ్యతల నుండి విముక్తి కలిగించండి
NEWS Feb 07,2025 12:56 pm
ములుగు జిల్లా సంక్షేమ అధికారి (DWO) బాధ్యతల నుంచి తనకు విముక్తి కలిగించాలని జిల్లా సంక్షేమ అధికారి శిరీష అన్నారు. సీడీపీవోగా విధులు నిర్వహిస్తూ DWOగా అదనపు బాధ్యతలు చేపట్టిన తనపై గత 15 రోజుల నుంచి వివిధ ప్రచార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు రాస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు సదరు వ్యక్తులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.