పనితీరులో పవన్ కు 10వ ర్యాంకు
NEWS Feb 07,2025 04:07 am
ఏపీలో మంత్రివర్గానికి సంబంధించి పనితీరు ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. నాదెండ్ల మనోహర్ తొలి 5 ర్యాంకులలో చోటు దక్కగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. ఆయనకు 10వ ర్యాంకు ఇచ్చారు. దీనిపై జన సేన పార్టీలో చర్చ మొదలైంది. శాఖల పరంగా పట్టు కలిగిన పవన్ కు చివరి ర్యాంకు దక్కడంపై మండిపడుతున్నారు జన సైనికులు.