తల్లి మందలించిందని కొడుకు సూసైడ్
NEWS Feb 05,2025 03:36 pm
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వేముల కుర్తి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బోధస్ గంగాధర్ స్కూల్ కి వెళ్లకుండా చెడు తిరుగుడు తిరుగుతున్నాడని తల్లి రాజవ్వ మందలించింది. వ్యవసాయ పనులకు వెళ్లింది. మనస్థాపం చెందిన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న తనను ఆస్పత్రికి తరలించారు. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేక పోవడంతో మరణించినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు.