Logo
Download our app
ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీ పీఠం బీజేపీదే
NEWS   Feb 05,2025 04:56 pm
ఢిల్లీలో అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్త‌గా బీజేపీ గెలుస్తుంద‌ని ప్ర‌క‌టించాయి. 27 ఏళ్ల తర్వాత ఎర్ర‌కోట‌పై క‌మ‌లం జెండా ఎగ‌ర‌నుంది. ప‌దేళ్లుగా పాల‌న సాగించిన ఆప్ త‌న ప‌వ‌ర్ ను కోల్పోనుంది. అన్ని స‌ర్వే సంస్థ‌లు, మీడియా సంస్థ‌ల‌న్నీ బీజేపీకి 39 నుంచి 60 సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించాయి. ఆప్ కు 25 సీట్ల కంటే త‌క్కువే వ‌స్తాయ‌ని అంచ‌నా వేశాయి. కాంగ్రెస్ పార్టీ 2 లేదా 3 సీట్ల‌కే ప‌రిమితం కానుంద‌ని వెల్ల‌డించాయి.
⚠️ You are not allowed to copy content or view source