Logo
Download our app
ఆగా ఖాన్ మృతి తీర‌ని లోటు
NEWS   Feb 05,2025 08:37 am
ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్‌‌ మృతి చెందడం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక వేత్త‌గా, మాన‌వ‌తావాదిగా పేరు పొందారని, ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి విశిష్ట సేవ‌లు అందించారని కొనియాడారు. వేలాది మంది విద్యార్థుల‌కు విద్యా దానం చేశార‌ని, ఉన్న‌త‌మైన చ‌దువులు చ‌దివేందుకు దోహ‌ద ప‌డ్డారని పేర్కొన్నారు. ఆయ‌న మృతి యావ‌త్ ప్ర‌పంచానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source