Logo
Download our app
నిజామాబాద్ జిల్లాలో 307 ఎంపిటిసి స్థానాలు
NEWS   Feb 05,2025 07:57 am
నిజామాబాద్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాల విభజన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. తుది జాబితాను ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను పునర్విభజన చేశారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో సైతం ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు. 299 స్థానాలకుగాను కొత్తగా ఏర్పడిన 8 స్థానాలను కలిపి మొత్తం 307 ఎంపీటీసీ స్థానాలకు పెరిగాయి. కొత్తగా చందూర్‌లో 2 ఎంపీటీసీ స్థానాలు, మోస్రాలో 2 ఎంపీటీసీ స్థానాలు, మాక్లూర్‌, నందిపేట్‌, డొంకేశ్వర్‌, సాలూర మండలానికి ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు.
⚠️ You are not allowed to copy content or view source