Logo
Download our app
తాళాలు తొల‌గించి డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల‌ల్లోకి
NEWS   Feb 05,2025 07:59 am
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా తమకు ఇండ్లు కేటాయించడం లేదని విసిగెత్తిన పలువురు మహిళలు ఇండ్ల తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకొని గృహ ప్రవేశం చేశారు. అనంతరం తమ తాళాలు వేసుకున్నారు. ఈ ఘటన మోర్తాడ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లు గడుస్తున్నా అధికారులు తమకు ఇండ్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నివాస గృహాలు లేక అద్దె ఇండ్లల్లో నివసిస్తున్నామని, ప్రస్తుతం తాము నివసిస్తున్న గృహాల్లో పాములు వస్తున్నాయని, ఖాళీగా ఉన్నాయన్నారు.
⚠️ You are not allowed to copy content or view source