Logo
Download our app
బ‌స్ డిపో కోసం మంత్రికి విన్న‌పం
NEWS   Feb 05,2025 08:07 am
ఎల్లారెడ్డి లో బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరారు ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ . మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. నిత్యం వందలాది మంది జీవనోపాధి కోసం పల్లెల నుంచి పట్టణానికి వస్తార‌ని, వారి కోసం స‌రైన ర‌వాణా సౌక‌ర్యం లేద‌ని వాపోయారు. గ‌త 40 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. బ‌స్ డిపో ఏర్పాటైతే అద‌న‌పు బ‌స్సులు వ‌స్తాయ‌ని, మ‌రికొంద‌రికి జాబ్స్ ద‌క్కుతాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి మారుమూల ప‌ల్లెకు బ‌స్సు సౌక‌ర్యం కల్పించాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source