తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Feb 05,2025 03:27 am
తిరుమలకు పోటెత్తారు భక్తులు. శ్రీ వేంకటేశ్వర స్వామిని 73 వేల 599 మంది భక్తులు దర్శించుకున్నారు. 16 వేల 69 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.21 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, టోకెన్లు లేని భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.