అసమగ్ర కులగణనని రద్దు చేయాలి
NEWS Feb 04,2025 05:01 pm
తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్బండ కులాల సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన కులగణన రిపోర్టుని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర కోణంతో అసమగ్రంగా రూపొందించడం వల్ల దీనిని ధర్మసమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీష్ గౌడ్ మీడియాతో తెలిపారు. ఈ దుశ్చర్యపై అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మౌనం వీడి అసెంబ్లీ చర్చల్లో గొంతు విప్పి మాట్లాడి ఈ రిపోర్టుని బహిష్కరించాలని కోరారు.