వాళ్లు గెలిచినా ఓడినట్లే
NEWS Feb 04,2025 12:25 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాము ఓడి పోలేదన్నారు. మేం ఓడినా గెలిచినట్లేనని, వాళ్లు గెలిచినా ఓడి పోయినట్లేనని ఎద్దేవా చేశారు. విధుల నిర్వహణలో మేయర్ శిరీషను కావాలని అవమానించారని ఆరోపించారు. లోపల సమావేశం జరుగుతుంటే బయట ఆమె ఆందోళన చేపట్టిందన్నారు. వ్యవస్థల ఉదాసీనత, అధికార దుర్వినియోగం మాత్రమే గెలిచిందన్నారు.