రహదారుల కబ్జాలను వెంటనే తొలగించాలి
NEWS Feb 04,2025 05:00 am
హైదరాబాద్ లోని పలు రహదారుల చుట్టు ఆక్రమించుకున్న కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వాణికి 71 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల్లో అధికభాగం పార్కులు, రహదారుల కబ్జాలే ఉన్నాయని.. లే ఔట్ ప్రకారం రహదారులుండేలా చూడాలని సూచించారు. ఎవరు ఆక్రమణలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.