పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం
NEWS Feb 04,2025 04:00 am
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆయన మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందన్నారు. ఇలాగే అటెండ్ కాకుండా ఉంటే బై పోల్ వస్తుందని హెచ్చరించారు. తను అసెంబ్లీకి వస్తే మంచిందని సూచించారు.