Logo
Download our app
భ‌క్తుల అన్న ప్ర‌సాదాల‌పై ఈవో ఆరా
NEWS   Feb 04,2025 03:14 am
తిరుమ‌లలో ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభమ‌య్యాయి. శ్రీ మలయప్ప స్వామి వారు 7 ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్ర‌హించారు. వాహ‌న సేవ‌లు తిల‌కించేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందిస్తున్నారు. వాహ‌న సేవ‌ల‌ను తిల‌కించేందుకు మాడ వీధుల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source