తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
NEWS Feb 04,2025 03:01 am
తిరుమలలో అంగరంగ వైభవోపేతంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. సూర్య ప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి రూపంలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమంత వాహనంపై ఊరేగారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ. చైర్మన్ నాయుడు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.