అయ్యప్ప ఆలయంలో ప్రాణప్రతిష్ట
NEWS Feb 03,2025 06:07 pm
సదాశివనగర్ మండల కేంద్రంలో ఓం శ్రీశ్రీశ్రీ అపురూప అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రాంగణం మార్మోగింది. గత రెండు సంవత్సరాల క్రితం ఆలయం నిర్మాణం కోసం వచ్చినప్పుడు నా వంతుగా సేవా చేస్తానని మాట ఇచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అయ్యప్ప శరణు గోశతో సదాశివనగర్ ఆలయంలో కన్నుల పండుగగా మారింది.