రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ. 5,337 కోట్లు
NEWS Feb 03,2025 11:12 am
రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీకి రూ. 9,417 కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు రూ. 41 వేల 677 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో నమో భారత్, అమృత్ భారత్ తెలంగాణకు వస్తాయన్నారు. ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 74 రైల్వే స్టేషన్లను అభివృద్ది చేశామన్నారు.