Logo
Download our app
పులి కోసం అటవీశాఖ అధికారులు పాట్లు
NEWS   Feb 03,2025 10:30 am
పులి రాకకోసం అటవీశాఖ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లి, వేమనపల్లి, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి జన్నారం అటవీ డివిజన్‌లోనే ఆవాసం ఏర్పర్చుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్లుగా రాకపోకలతోనే సరిపెడుతున్న పులి ఇక్కడే ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌ జన్నారం అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. 2024 సెప్టెంబర్‌లో పైడిపెల్లికి చెందిన ఓ రైతు ఆవులపై దాడి చేసిన అప్పటి నుంచి ఇందన్‌పల్లి, జన్నారం అటవీ రేంజ్‌లలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source