సూఫీ బసంత్ ఉత్సవంలో చిలుకూరు పూజారి
NEWS Feb 03,2025 03:34 am
హైదరాబాద్ లో జరిగిన సూఫీ బసంత్ ఉత్సవానికి చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ హాజరయ్యారు. ఘన స్వాగతం పలికారు సూఫీ పెద్దలు. హజ్రత్ షేక్ జీ హాలి దర్గాలో బసంత్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాల్లో ప్రారంభమైంది ఈ ఉత్సవం. దీనికి కొనసాగింపుగా ఓల్డ్ సిటీలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సర్వ మత సమ్మేళానికి ఇది నిదర్శనమన్నారు రంగరాజన్.