Logo
Download our app
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
NEWS   Feb 03,2025 03:40 am
నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1988 -89 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు నందిపేట పద్మశాలి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమకు విద్యాబుద్ధలు నేర్పిన ఉపాధ్యాయులు అబ్దుల్‌ నబీ, రామ్మూర్తి, జనార్దన్‌, లక్ష్మీకాంతాచారి, పీఈటీ నరసింహారెడ్డి, శంకర్‌, సాయన్న, రామానుజను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
⚠️ You are not allowed to copy content or view source