భారత్ విజయం గర్వ కారణం
NEWS Feb 02,2025 12:23 pm
మహిళల అండర్ -19 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు పీఎం మోడీ. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించిన అమ్మాయిలకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలిపారు. మన నారీ శక్తి సాధించిన ఈ గెలుపు పట్ల ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ విక్టరీ జట్టు సమిష్టి కృషికి దక్కిన ఫలితమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరారు. ఈ అపురూపమైన గెలుపు కోట్లాది యువతకు స్పూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షించారు.