ఎవరి చరిత్ర ఏమిటో నాకు తెలుసు
NEWS Feb 02,2025 11:54 am
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నోరు విప్పారు. ఫాం హౌస్ లో 11 మంది ఎమ్మెల్యేలం భేటీ అయిన మాట వాస్తవమేనని అన్నారు. తాను ఏ మంత్రి వద్దకు ఫైల్ క్లియర్ చేయమని అడగలేదన్నారు. ఎవరి చరిత్ర ఏమిటో తనకు బాగా తెలుసన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే కామెంట్స్ కలకలం రేగడంతో రంగంలోకి జానా రెడ్డి దిగారు. ఆయన సంయమనం పాటించాలని కోరారు.