Logo
Download our app
దొంగ నోట్ల కేసులో మరొకరు అరెస్ట్
NEWS   Feb 02,2025 07:52 am
గాంధారి మండలం చద్మల్‌ తండాలో దొంగనోట్ల చెలామణి కేసులో మరో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. చద్మల్‌ తండాలో సంక్రాంతి సందర్భంగా లక్ష్మమ్మ గుడివద్ద జరిగే జాతరలో వచ్చిన కానుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తండావాసులకు అప్పుగా ఇస్తారు. ఈ క్రమంలో కొందరు అసలు నోట్ల కట్టల్లో దొంగనోట్లు ఉంచి ఇచ్చారు. అప్పు తీసుకున్న వారు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ కేసులో ఈ నెల 24న ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source