Logo
Download our app
భోజన పథకం ఏజెన్సీ తొలగింపు
NEWS   Feb 02,2025 07:52 am
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) ఏజెన్సీని తొలగించినట్లు కామారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బియ్యం, వంట సామగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో అనారోగ్యానికి గురైన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లతో మాట్లాడి ఫుడ్‌ పాయిజన్‌ కావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎండీఎం ఏజెన్సీ తప్పిదం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source