Logo
Download our app
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
NEWS   Feb 02,2025 07:53 am
ప్రతి రైతు సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణి సూచించారు. భిక్కనూరు రైతు వేదికలో న్యాయ చైత న్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని రైతులకు అసైన్‌మెంట్‌ భూములు, విత్తనాలు, విద్యుత్‌, మార్కెటింగ్‌ వంటి చట్టాల గురించి వివరించారు. రైతు విత్తనం కొనుగోలు మొదలు పంటను మార్కెట్‌లో అమ్ముకునే వరకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source