దోమకొండ 50 పడకల ఆసుపత్రి
NEWS Feb 02,2025 07:53 am
దోమకొండ మండల కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను వంద పడకలకు పెంచడానికి సంబంధించిన ఫైల్ తిరస్కరణకు గురైంది. సీహెచ్‌సీని యాభై పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి అంగీకరించిన సీఎం.. మరో 50పడకల ఆసుపత్రికి సంతకం చేశారు. దోమకొండ సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గతంలో సీఎంను కోరారు. ఆస్పత్రి భవన నిర్మాణం కోసం ముత్యంపేట రోడ్‌లో 4 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ దోమకొండ పంచాయతీ తీర్మానం కూడా చేసింది