తిరుమల క్షేత్రం భక్త జన సందోహం
NEWS Feb 02,2025 04:34 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. 80 వేల 871 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. 24 వేల 257 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.