ఆడబిడ్డలపై అభాండాలు వేస్తే జైలుకే
NEWS Feb 01,2025 10:57 am
అన్నెం పున్నెం ఎరుగని ఆడబిడ్డలపై అభాండాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి వంగలపూడి అనిత. కనీసం మానవత్వం అన్నది లేకుండా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. శ్రీకాకుళం డిగ్రీ యువతి ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేశామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన ప్రసాద రావు చేసిన కామెంట్స్ దారుణమన్నారు.