సభ శాంతియుతంగా జరగాలంటున్నాం
NEWS Feb 01,2025 07:34 am
నగరం మధ్యలో రోడ్లపైన లక్షలాది మంది చేరడం వల్ల శాంతిభద్రతల సమస్య ఏర్పడి అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం జరిగే అవకాశాలు ఉంటాయని దానివల్ల దళిత జాతులకు అప్రతిష్ట ఏర్పడకూడదని, ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ కార్యక్రమాన్ని గ్రౌండ్ లేదా స్టేడియంలో నిర్వహిస్తే బాగుంటుందని మాత్రమే సూచించా మని, కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగా లని మేం కోరుకుంటున్నామని 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బైరి వెంకటేశం ప్రకటన విడుదల చేశారు.