సర్కార్ బడులకు మొగిలిగిద్ద స్పూర్తి
NEWS Feb 01,2025 03:23 am
సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గంలోని మొగిలిగిద్ద పాఠశాలను సందర్శించారు. ఆ బడి సాధించిన ప్రగతిని చూసి సంతోషానికి లోనయ్యారు. ఒకనాడు చదువు కోవాలంటే ఇబ్బందులు ఉండేవన్నారు. కానీ తరాలు మారినా స్కూల్ మాత్రం మార లేదన్నారు. ఇక్కడ చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్థానాల్లో నిలిచారని ప్రశంసించారు. మొగిలిగిద్ద చెక్కు చెదరని జ్ఞాపకమని, వేలాది ప్రభుత్వ బడులకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.