రాత్రికి రాత్రే అన్నీ జరగవు
NEWS Feb 01,2025 02:48 am
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరుగుతాయని తాము చెప్పలేదన్నారు. కూటమి సర్కార్ పై అప్పుల భారాన్ని గత జగన్ రెడ్డి సర్కార్ మోపిందన్నారు. చేసిన అప్పులు తీర్చేందుకు తీసుకు వచ్చిన డబ్బులు వడ్డీలకే సరి పోవడం లేదంటూ వాపోయారు సీఎం. ప్రజలు తమ ఇబ్బందులను అర్థం చేసుకోవాలని కోరారు.