తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Feb 01,2025 02:23 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 51 వేల 818 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 23 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో. ప్రస్తుతం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.